ఐపీఎల్ కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ : కీరోల్ ప్లే చేసిన దాదా

ఐపీఎల్ కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ :  కీరోల్ ప్లే చేసిన దాదా

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో సెప్టెంబ‌ర్ 19నుంచి యూఏఈ లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించారు. గ‌తంలోనే ఈ సంవత్సరాన్ని ఐపీఎల్ లేకుండా ముగించడం ఎంత మాత్రం ఇష్టం లేదని గతంలోనే దాదా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై గంగూలీ దృష్టిసారించారు. గంగూలీ చెప్పినట్టుగానే కేవలం ఐదు రోజులే (సాయంత్రం 3.30 గంటలకు ఒక మ్యాచ్, రాత్రి 7.30కు మరో మ్యాచ్) రోజుకు రెండు మ్యాచులు చొప్పున జరగనున్నాయి. కాగా ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ఐపీఎల్ సీజ‌న్ లో స్టేడియంల‌న్నీ అభిమానుల‌తో కిక్కిరిసిపోయేవి. ఈ ఏడేది ఐపీఎల్ మ్యాచ్ లో యూఏఈలో జ‌రుగుతుండ‌గా..క‌రోనా వ‌ల్ల ఫ్యాన్స్ ను అనుమ‌తిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ అనుమ‌తిపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ తో త్వ‌ర‌లోనే సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.