ధోనీ ఎత్తుకున్న పాప ఎవరు.. ఫైనల్ మ్యాచ్ స్పెషల్ ఎట్రాక్షన్

ధోనీ ఎత్తుకున్న పాప ఎవరు.. ఫైనల్ మ్యాచ్ స్పెషల్ ఎట్రాక్షన్

ఎంఎస్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరొక బ్రాండ్. తన ఆట.. మాట.. నడవడికే అతన్ని అంత ఎత్తులో నిలబెట్టాయి. గెలిచామని పొంగిపోడు.. ఓడామని బాధపడడు. ప్రత్యర్థి జట్టును ఓడించడానికి అతడు చేసే వ్యూహరచనలు అమోఘం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ధోనీని అభిమానులు ఒక దేవుడిగా భావిస్తారు. అలాంటి ధోని ఒక చిన్నారిని ఎత్తుకుంటే వైరల్ అవ్వకుండా ఉంటుందా. స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. ఆ చిన్నారి ఎవరా? అంటూ నెటిజన్స్ శోధించడం మొదలు పెట్టారు. 

ధోని ఎత్తుకున్న చిన్నారి మరెవరో కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్, న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ సాంట్నర్ కూతురు. సాంట్నర్- కైట్లిన్ డోడున్స్కీల ఒక్కగానొక్క సంతానం. పేరు.. ఇజ్జీ ఎస్మే సాంట్నర్. ఫైనల్ మ్యాచ్ కావడంతో కైట్లిన్ కూతురితో కలిసి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది. మ్యాచ్ ముగిశాక మైదానంలోకి రాగా.. ధోని ఆ చిన్నారిని ఎత్తుకున్నాడు. సాంట్నర్ జట్టులో ఉన్నప్పటికీ.. ఈ సీజన్‌లో అతనికి ఆడే అవకాశం రాలేదు. జడేజా, తీక్షణ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉండటంతో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

https://twitter.com/bhuvanChari007/status/1663294176660975617