IPL ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల.. ఆర్సీబీ ఫ్యాన్స్‏కు ఇది బ్యాడ్ న్యూసే..!

IPL ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల.. ఆర్సీబీ ఫ్యాన్స్‏కు ఇది బ్యాడ్ న్యూసే..!

ముంబై: ఐపీఎల్ 2026 ఫైనల్, ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదలైంది. క్వాలిఫయర్ 1 మ్యాచ్ మే, 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరగనుంది. మే 27న న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులను అలరించనుంది. క్వాలిఫయర్ 2 మే 29న, ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ఆనవాయితీ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ హోం గ్రౌండ్‎లో నిర్వహిస్తారు. ఈ లెక్కన గతేడాది చాంపియన్ అయినా ఆర్సీబీ హోంగ్రౌండ్ బెంగళూర్‎లో ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ జరగాలి. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్‎ను బెంగళూర్ నుంచి గుజరాత్‎లోని అహ్మదాబాద్‎కు మార్చింది.

 కర్నాటకలో ఎమ్మెల్యే కోటా ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, బెంగళూర్‎లో గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ యాజమాన్యం వేదికను మార్చింది. ఈ నిర్ణయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. బీసీసీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోందని.. మేజర్ మ్యాచ్‎లన్నీ అహ్మదాబాద్‎కే తరలిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. 

IPL 2026 ఫైనల్, ప్లేఆఫ్స్ షెడ్యూల్:

  • మే 26: క్వాలిఫైయర్ 1 - ధర్మశాలలో
  • మే 27: ఎలిమినేటర్ - ముల్లాన్‌పూర్‌లో
  • మే 29: క్వాలిఫైయర్ 2 - ముల్లాన్‌పూర్‌లో
  • మే 31: ఫైనల్ - అహ్మదాబాద్‌లో