షెడ్యూల్ ప్రకారం కోల్ కతాలోనే IPL ఆటగాళ్ల వేలం జరుగుతుందని తెలిపింది BCCI. ఫ్రాంచైజీ అధికారుల్లో కొంత మంది మంగళవారం సాయంత్రం, మరికొంత మంది బుధవారం ఉదయం కోల్‌కతా చేరుకోనున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈనెల 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరుగుతుందా అనే అనుమానాలు వెల్లువెత్తున్నాయి. దీనిపై స్పందించిన BCCIలోని ఓ ఉన్నతాధికారి షెడ్యూల్ ప్రకారం గురువారమే(డిసెంబర్ -19) వేలం జరుగుతుందని తెలిపారు.
అంతేకాదు వేలంపై ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తున్నామని చెప్పారు. అయితే ఈ నెల 20న కోల్‌కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీనేతలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో వేలం ముగిసిన మరుసటి రోజునే తిరుగుపయనంపై కూడా ఫ్రాంఛైజీలు ఆలోచిస్తున్నాయి.
ఈ వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన లిస్టును బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు వేలం ఆరంభమవుతుంది. 73 ఖాళీలకు వేలం జరుగనుంది.

