హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసం.. ఫేక్ యాప్స్, వెబ్ సైట్లతో దోపిడీ...

హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసం.. ఫేక్ యాప్స్, వెబ్ సైట్లతో దోపిడీ...

హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మే 22న జరగనున్న సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ను టార్గెట్ చేసుకొని మోసానికి పాల్పడుతోంది ముఠా. అభిమానుల క్రేజ్ ను ఆసరాగా చేసుకొని ఫేక్ యాప్స్, వెబ్ సైట్లతో దోపిడీ చేస్తున్నారు. అఫీషియల్ టికెటింగ్ యాప్ district.in⁠ ను పోలిన నకిలీ యాప్స్ సృష్టించారు సైబర్ కేటుగాళ్ళు.

తక్కువ ధరకే ఐపీఎల్ టికెట్లు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా చేయడంతో.. నిజమని నమ్మి టికెట్లు బుక్ చేసుకున్నారు అభిమానులు. పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాక పోవడంతో కంగుతిన్నారు క్రికెట్ అభిమానులు.  మోసపోయామని గర్హించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. 

ఇలాంటి ఫేక్ లింకులు క్లిక్ చేస్తే డబ్బులు గల్లంతయ్యే ప్రమాదం ఉందని..బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మొద్దని సూచిస్తున్నారు పోలీసులు. 

ఫేక్ యాప్స్, వెబ్ సైట్లపై నిఘా పెట్టామని.. అనుమానాస్పద లింకులు, యాప్స్ పై వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు. సైబర్ మోసాల పట్ల క్రికెట్ ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.