హెపటైటిస్ ఇదో సైలెంట్ కిల్లర్.. హెచ్ఐవీ కన్నా ప్రమాదకరం..ఈ వైరస్ పై సరైన అవగాహన లేకపోతే సోకిన వారి ప్రాణాలు కూడా పోవచ్చు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తుంది. హెపటైటిస్ బి వైరస్ ను కనుగొన్న ప్రొఫెసర్ బ్లంబర్జ్ జయంతి సందర్భంగా జులై 28న హెపటైటిస్ డేగా నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది వరల్డ్ హెపటైటిస్ డేను 2030 నాటికి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే లక్ష్యంగా ప్రకటించింది.
ఏటా 3.25 కోట్ల మందికి ఇటీవల కాలంలోనే హైపటైటిస్ వైరస్ పై జనాల్లో అవగాహన మొదలైంది. ఒక్కసారి ఈ వైరస్ బాడీలోకి ప్రవేశించిందంటే తన పని తాను చేసుకుంటూ పోతుంది. హెచ్ఐవీవైరస్ కన్నా ఇది 50 నుంచి వందశాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు. హెపటైటిస్ బీ,సీ కారణంగా దేశంలో ఏటా3.25 కోట్ల ప్రభావితమవుతుండగా, కోటి 34 లక్షల మంది వరకు చనిపోతున్నట్లు గణంకాల ద్వారా తెలుస్తుంది. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తే అది క్యాన్సర్ గా మారుతున్నపరిస్థితి ఉంది. లివర్ క్యాన్సర్లలో 60 శాతం అలస్యంగానే గుర్తిస్తున్నారు. ప్రస్తుతం హెపటైటిస్ బీ,సీ కి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
ఐదు రకాల వైరస్ ల గ్రూప్
హెపటైటిస్ జబ్బు కాదని, ఐదు రకాల ఇన్ ఫెక్షన్లను కలిగించే వైరస్ గ్రూప్ అని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఏ,బీ,సీ,డీ,ఈ రకాలుండగా, బీ,సీ తో బాధపడే వారే ఎక్కువగాఉన్నారు. ప్రపంచంలో బి తో 3.4 శాతం, సీ తో 1 శాతం ప్రజలు ఉండగా, గర్భిణుల్లో 1 శాతం హైపటైటిస్ బారినపడుతున్న వారే. ఇన్ ఫెక్షన్ల కారణంగా దీర్ఘకాలంలోలివర్ దెబ్బతింటుంది. హెపటైటిస్ ఏ, ఈ వైరస్ లు మాత్రం కామెర్లతో బాధపడే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. హెపటైటిస్ డీ వైరస్ మాత్రం ఒకరి నుంచి ఒకరికి రక్తం మార్పిడిచేసే సమయంలోవ్యాపించే అవకాశం ఉంది. నీటి కాలుష్యం కారణంగానూ హెపటైటిస్ డి వ్యాపించే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది హెపటైటిస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా బీ, సీ, డీ లు పెద్దగా నమోదు కాలేదు. కానీ ఎ, ఈ మాత్రం పెరుగుతున్నాయి. సీ వేగంగా విస్తరిస్తుంది. దీనిపై వైద్యాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
లక్షణాలు వెంటనే తెలియవు
హెపటైటిస్ ఇన్ ఫెక్షన్ల కారణంగావస్తది. ఇది సోకిన వారికి వెంటనే లక్షణాలు తెలియవు. శరీరంలోకి వైరస్ ప్రవేశించిన 30 –180 రోజుల వరకు లక్షణాలు బయటపడవు. ఎప్పటికప్పుడు హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవాలి. సరైన సమయంలో చికిత్సతో పాటు
సమతౌల్యంగా ఆహారం తీసుకుంటే హెపటైటిస్ బి ని నివారిం చవచ్చు. ప్రజలకు దీనిపై పూర్తిగా అవగాహన కలిగి
జాగ్రత్తలు తీసుకుం టే ఎలాంటి ప్రమాదం ఉండదు
