IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచింది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మైదానంలో స్కోరును డిఫెండ్ చేయడం సులభమని భావించిన పరాగ్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కండరాల నొప్పితో (Muscle Spasm) ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టు పగ్గాలను చేపట్టాడు.
రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ముందుగా బ్యాటింగ్ చేయడం తమకు సరైన నిర్ణయం.. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సుమారు 210 పరుగుల భారీ స్కోరు సాధించి, దానిని డిఫెండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జట్టు అన్ని పరిస్థితుల్లో ఆడగలిగే విధంగా తయారవ్వాలని ఆకాంక్షించారు. ఇక తుది జట్టులో రెండు మార్పులు చేశాం.. బ్రిజేష్ స్థానంలో తుషార్ దేశ్‌పాండే చోటు దక్కించుకున్నాడు. అలాగే రవి బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబే జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచి ఉంటే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం.. శుభ్‌మన్ గిల్‌కు కండరాల సమస్యతో ఈ మ్యాచ్ ఆడటం లేదు.. త్వరలోనే తిరిగి జట్టులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.. కొత్త ఆటగాడు కేకే తన తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.. అతని ప్రదర్శనను చూడటానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. గత మ్యాచ్‌లోనూ జట్టు మంచి క్రికెట్ ఆడిందని, ఈ మ్యాచ్‌లో 100 శాతం సామర్థ్యంతో ఆడాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
►ALSO READ | IPL 2026: ఇంపాక్ట్‌గా వచ్చి ఇరగదీసిన రిజ్వీ.. ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
గుజరాత్ టైటాన్స్: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(c), కగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
🚨 Toss 🚨@rajasthanroyals won the toss and elected to bat first against @gujarat_titans in Ahmedabad.
— IndianPremierLeague (@IPL) April 4, 2026
Updates ▶️ https://t.co/6D02Fh0IHv#TATAIPL | #KhelBindaas | #GTvRR pic.twitter.com/88zYDnDHOz
