ఇంటర్నేషనల్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ గా బోధన శివానందన్‌‌‌‌

ఇంటర్నేషనల్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ గా బోధన శివానందన్‌‌‌‌

లండన్‌‌‌‌: భారత సంతతికి చెందిన బోధన శివానందన్‌‌‌‌.. చెస్‌‌‌‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అతి పిన్న వయసులో (11 ఏళ్లు) ఇంటర్నేషనల్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ హోదాను సాధించిన విమెన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కింది. ఫలితంగా 38 ఏళ్ల కిందట లెజెండ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ జుడిత్‌‌‌‌ పోల్గర్‌‌‌‌ పేరుమీద ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 

యూరోపియన్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ చెస్‌‌‌‌ క్లబ్‌‌‌‌ కప్‌‌‌‌ టోర్నీలో ఆఖరి రౌండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో విజయం సాధించడం ద్వారా బోధన ఈ ఘనతను అందుకుంది. విక్టోరియా జోహన్సన్‌‌‌‌ (స్వీడన్‌‌‌‌)తో జరిగిన ఈ గేమ్‌‌‌‌లో బోధన 32 ఎత్తుల వద్ద గెలిచి టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుంది.

ఓవరాల్‌‌‌‌గా యంగెస్ట్‌‌‌‌ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ జాబితాలో చోటు దక్కించుకున్న పదో ప్లేయర్‌‌‌‌గా బోధన నిలిచింది. ఈ లిస్ట్‌‌‌‌లో ఇండియా నుంచి గ్రాండ్‌‌‌‌ మాస్టర్లు ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద, డి. గుకేశ్‌‌‌‌ కూడా ఉన్నారు.