బాక్సింగ్‌‌‌‌ అండర్‌‌‌‌–19 చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ లో సెమీస్ లో ఆదిత్య...

బాక్సింగ్‌‌‌‌ అండర్‌‌‌‌–19 చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ లో సెమీస్ లో ఆదిత్య...

న్యూఢిల్లీ: మాంటెనెగ్రోలని బుద్వాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్‌‌‌‌ అండర్‌‌‌‌–19 చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియాకు మూడో పతకం ఖాయమైంది. శనివారం జరిగిన మెన్స్‌‌‌‌ 55 కేజీల క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఆదిత్య 5–0తో టొమాసో ఓర్లాండ్‌‌‌‌ (ఇటలీ)పై విజయం సాధించి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. ఫలితంగా కనీసం కాంస్యాన్ని ఖాయం చేశాడు. బౌట్‌‌‌‌ ఆద్యంతం అప్పర్‌‌‌‌ కట్స్‌‌‌‌, హుక్స్‌‌‌‌లతో చెలరేగిన ఆదిత్య ఏకగ్రీవంగా పాయింట్లు సాధించాడు. 

సెమీస్‌‌‌‌లో ఆదిత్య.. నిహాత్‌‌‌‌ గసిమోవ్‌‌‌‌ (అజర్‌‌‌‌బైజాన్‌‌‌‌)తో తలపడతాడు. ఇప్పటికే మేఘా షియోకంద్‌‌‌‌ (80 కేజీ), ప్రాచీ టోకాస్‌‌‌‌ (57 కేజీ) సెమీస్‌‌‌‌ చేరి మెడల్స్‌‌‌‌ను ఖాయం చేసుకున్నారు. మెన్స్‌‌‌‌ 65 కేజీ క్వార్టర్స్‌‌‌‌లో మౌసమ్‌‌‌‌ సుహాగ్‌‌‌‌ 0–5తో యషువా ఫ్లెమింగ్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌) చేతిలో, 50 కేజీల విభాగంలో అమన్‌‌‌‌ దేవ్‌‌‌‌ 0–5తో షల్వా బెరిడ్జ్‌‌‌‌ (జార్జియా) చేతిలో ఓడారు. మరో బౌట్‌‌‌‌లో లక్షు కూడా 0–5తో మార్లే మెక్‌‌‌‌నీలీ (అమెరికా) చేతిలో కంగుతిన్నాడు.