ముంబై ఇండియన్స్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గా పొలార్డ్‌‌‌‌

ముంబై ఇండియన్స్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గా పొలార్డ్‌‌‌‌

ముంబై: వెస్టిండీస్‌‌‌‌ మాజీ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ కీరన్‌‌‌‌ పొలార్డ్‌‌‌‌ను ముంబై ఇండియన్స్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా నియమించారు. మహేల జయవర్ధనే స్థానంలో పొలార్డ్‌‌‌‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. గత కొన్ని సీజన్ల నుంచి ముంబైకి పొలార్డ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా సేవలందిస్తున్నాడు. 

2020లో చివరిసారి టైటిల్‌‌‌‌ గెలిచిన ముంబై ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలనే ఉద్దేశంతో కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌లో మార్పులు చేస్తోంది. ముంబై ఇండియన్స్‌‌‌‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని పొలార్డ్‌‌‌‌ గుర్తు చేసుకున్నాడు. ‘ప్లేయర్‌‌‌‌గా, కోచ్‌‌‌‌గా నా ప్రయాణం ఇక్కడే మొదలైంది. 

ఈ జట్టు విలువ ఏంటో బాగా తెలుసు. ప్లేయర్‌‌‌‌గా 2009 నుంచి 2022 వరకు సేవలందించా. ఇప్పుడు అదే స్థాయిలో కోచ్‌‌‌‌గా కూడా జట్టును విజయపథంలో నడిపిస్తా. ఈ టీమ్‌‌‌‌లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. గెలవాలనే కసిని ప్లేయర్లలో నింపడమే నా మొదటి ప్రాధాన్యం’ అని పొలార్డ్‌‌‌‌ పేర్కొన్నాడు.