ఎల్‌‌‌‌నినోపై బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు : విప్ వేముల వీరేశం 

ఎల్‌‌‌‌నినోపై బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు : విప్ వేముల వీరేశం 
  • విప్ వేముల వీరేశం కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రభావంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు ఎంతమాత్రమూ నమ్మరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వాస్తవాలు గ్రహించకుండా ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎల్పీలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాలను ఎల్‌‌‌‌నినో ఇబ్బంది పెడుతుంటే, దానిని సీఎం రేవంత్ రెడ్డికి ముడిపెట్టడం ఏమాత్రం తగదని హితవు పలికారు.

కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం చేసి, ఇప్పుడు వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావు వంటి బాధ్యతాయుతమైన నేతలు ఎల్‌‌‌‌నినో అంశంపై ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయం చేయడం సముచితం కాదని వెల్లడించారు. తీవ్రమైన సమస్యలు ఎదురైనప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం విచారకరమని పేర్కొన్నారు.