చెన్నై: తమిళనాడులో విమాన ఇంధన ధరలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెన్నైలో 29 శాతం నుంచి 16 శాతానికి, రాష్ట్రంలోని ఇతర అన్ని విమానాశ్రయాలలో కేవలం 1 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు అక్టోబర్ 31 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుందని, ఏడాదిపాటు అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘తమిళనాడులో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించడం అభినందనీయం. విమానయాన రంగానికి ఇది స్వాగతించదగిన అడుగు' అని కొనియాడారు.
విమాన ప్రయాణాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. కాగా, టాటా గ్రూప్‌కు చెందిన ‘ఎయిర్ ఇండియా’ కూడా సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
