పీస్ బాండ్‌‌‌‌పై సంతకం చేయను.. ఐసా ప్రెసిడెంట్ నేహా బోరా

పీస్ బాండ్‌‌‌‌పై సంతకం చేయను.. ఐసా ప్రెసిడెంట్ నేహా బోరా

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి తెలపకుండా చేసేలా ఉన్న పీస్ బాండ్‌‌‌‌పై తాను సంతకం చేయబోనని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) అధ్యక్షురాలు నేహా బోరా స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. 

ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నేహా బోరా దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్‌‌‌‌ఈఎం) ఎదుట హాజరై బాండ్ సమర్పించాలని ఆదేశించింది.  హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌‌‌‌ఈఎం ఎదుట జరిగే విచారణకు హాజరవుతానని నేహా బోరా స్పష్టం చేశారు.