గంజాయి సాగు చేస్తున్న ఐటీ ఎంప్లాయ్ అరెస్ట్

గంజాయి సాగు చేస్తున్న ఐటీ ఎంప్లాయ్ అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: గంజాయి మొక్కలను పెంచుతున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ను హైదరాబాద్ లోని వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్  శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పార్సీగుట్టకు చెందిన రాహుల్ రాజ్(29) సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. గంజాయికి బానిసైన అతను.. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచాలనుకున్నాడు.

సప్లయర్ల దగ్గర గంజాయి సీడ్స్ సేకరించి ఇంట్లోనే పెంచడం మొదలుపెట్టాడు. దీని గురించి సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు గురువారం రాహుల్ ఇంట్లో సోదాలు చేశారు. మూడు గంజాయి మొక్కలు, సీడ్స్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.