రియల్ హీరో: ఆస్పత్రిలో లేని గ్లౌజులు.. ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టర్

రియల్ హీరో: ఆస్పత్రిలో లేని గ్లౌజులు.. ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టర్

కరోనా వైరస్ సోకిన వ్యాధి గ్రస్తులకు ట్రీట్మెంట్ చేసిన ఓ డాక్టర్ మృతి చెందాడు. చైనా తరువాత వైరస్ విలయ తాండవం చేస్తున్న దేశం ఇటలీ.  ఆ దేశ ప్రభుత్వం ప్రారంభంలో వైరస్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల భారీ ఎత్తున ప్రాణనష్టం చవిచూడాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ వైరస్ నుంచి ప్రజల్ని కాపాడేందుకు అక్కడి వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారిలో ” మార్చేల్లో నాటాలి ” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ఇటలీ దేశం మొత్తంలో భారీగా ప్రాణాలు కోల్పోయిన ప్రాంతమైన కోడోజ్ఞోకి చెందిన ఓ ఆస్పత్రిలో “నాటాలి” డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన బాధితులు ఎక్కువగా ఉండడంతో…డాక్టర్లు తమని తాము రక్షించుకునేందు ఉపయోగించే గ్లౌజ్ లు , జాకెట్ లు అయిపోయాయి. అయినా వెనకడుగు వేయని నాటాలి. కరోనా వైరస్ నుంచి బాధితుల్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించాడు. చేతులకు గ్లౌజులు, జాకెట్లు ధరించకుండా  ట్రీట్మెంట్ చేశాడు. నాటాలి ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో  కరోనా వైరస్ సోకి  ప్రాణాలు కోల్పోయినట్లు ఇటాలియన్ ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ తెలిపింది.