విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: పవన్ కళ్యాణ్

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: పవన్ కళ్యాణ్

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పరీక్షలు ఫెయిలైనందుకు 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. అందుకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ముందు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులపై అధికారులు దాడులు చేయించారని, ఈ చర్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

జీవితం విలువైనదని., ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడొద్దని విద్యార్థులకు పవన్ సూచించారు. విద్యార్థులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.