Janhvi Kapoor: జాన్వీ ఝలక్? ‘పెద్ది’ ప్రమోషన్స్‌కు రామ్ చరణ్ బ్యూటీ దూరం.. అసలు మ్యాటర్ ఏంటంటే!

Janhvi Kapoor: జాన్వీ ఝలక్? ‘పెద్ది’ ప్రమోషన్స్‌కు రామ్ చరణ్ బ్యూటీ దూరం.. అసలు మ్యాటర్ ఏంటంటే!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం మేకర్స్ మైండ్ బ్లోయింగ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. అయితే, ఈ మెగా హంగామాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

జాన్వీ కపూర్ సైలెంట్..

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌పై గట్టిగా ఫోకస్ పెట్టిన ఈ అతిలోక సుందరి.. ‘పెద్ది’ సినిమాలో పల్లెటూరి పడచుగా డీగ్లామర్ లుక్‌లో కనిపించబోతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే, ప్రమోషనల్ వీడియోల్లో జాన్వీ మిస్ అవ్వడం ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోంది. ఇంత పెద్ద ప్రమోషన్స్ కు ఈ బ్యూటీ వస్తుందని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

అయితే జాన్వీ ఈ ప్రాజెక్ట్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఒప్పుకుందని, సినిమాలో తన క్యారెక్టర్ లెంగ్త్ తక్కువగా ఉండడం వల్లే ప్రమోషన్లకు ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఒక క్రేజీ రూమర్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, చరణ్ లాంటి స్టార్ సినిమాను లైట్ తీసుకోవడం జాన్వీ కెరీర్‌కే పెద్ద మైనస్ అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా సక్సెస్ ఆమెకు చాలా కీలకం.

‘పెద్ది పవర్ ప్లే టూర్’..

మేకర్స్ ఈ సినిమా కోసం మైండ్ బ్లోయింగ్ ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేశారు. ‘పెద్ది పవర్ ప్లే టూర్’ పేరుతో కేవలం 15 రోజుల్లోనే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయనున్నారు. మే 18న బాలీవుడ్ హబ్ ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ కానుంది. ఇందులో కుస్తీ వీరుడిగా, క్రికెటర్‌గా చరణ్ విశ్వరూపం చూపించబోతున్నారట. మే 22న హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో జరిగే RCB vs SRH ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. అదే వేదికపై ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌తో స్టేడియం దద్దరిల్లిపోనుంది.  మే 23న భోపాల్‌లో మ్యూజికల్ ఈవెంట్, మే 24న బెంగళూరు, మే 28న ఢిల్లీ, మే 30న చెన్నైలలో భారీ ఈవెంట్స్ ఉంటాయి. జూన్ 1న కథా నేపథ్యమైన విజయనగరంలో ఫ్యాన్స్ గెట్-టుగెదర్, జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనున్నాయి.

పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ..

ఒకవేళ ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటే అభిమానులకు నిరాశ తప్పదు.  ఇదే నిజమైతే, సౌత్ మార్కెట్‌పై కన్నేసిన జాన్వీ కెరీర్‌కు ఇది పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘పెద్ది’ లాంటి విజువల్ వండర్ సినిమాను ప్రమోట్ చేయకపోతే నేషనల్ వైడ్‌గా వచ్చే క్రేజ్‌ను ఆమె మిస్ చేసుకున్నట్లే. అయితే, మే 18న ముంబైలో జరిగే ట్రైలర్ లాంచ్‌తో జాన్వీ ఎంట్రీ ఇచ్చి ఈ రూమర్లకు చెక్ పెడుతుందేమో చూడాలి.