కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) వైవాహిక జీవితంలో రేగిన వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారం నడుస్తున్న వేళ.. ఇటీవల మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఒక నటి నాశనం చేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతూ చర్చకు దారితీసింది.
ఆ 'ఇడ్లీ నటి' ఎవరు?
ప్రెస్ మీట్‌లో రవి మోహన్ ఎక్కడా పేరు చెప్పకుండా ఒక “ఇడ్లీ నటి” (idly nadigai) తన సంసారంలో నిప్పులు పోసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆ నటి నా కుటుంబాన్ని ముంచేసింది. నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఆమెకు అస్సలు లేదు అంటూ విరుచుకుపడ్డారు. కేవలం తన జీవితమే కాదు, ఇండస్ట్రీలోని మరికొందరు నటుల సంసారాలను కూడా ఆమె ముక్కలు చేసిందని బాంబు పేల్చారు. దాంతో నెటిజన్లు ఆ 'ఇడ్లీ నటి' ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. గతంలో ఆర్తి రవికి మద్దతుగా నిలిచిన సీనియర్ నటి ఖుష్బూ సుందర్‌నే రవి మోహన్ టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఖుష్బూ కౌంటర్.. నెటిజన్ల ఫైర్!
ఈ వివాదంపై నటి ఖుష్బూ ఎక్స్ వేదికగా పరోక్షంగా స్పందించారు. కొందరు తమ డీఎన్ఏ (DNA) ఏంటో నిరూపించుకోవడానికే పుట్టినట్టున్నారు. నన్ను సరైనదాన్నే అని నిరూపించినందుకు థాంక్స్ అంటూ ఘాటుగా పోస్ట్ పెట్టారు. అయితే, ఈ 'DNA' కామెంట్ నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. వేరొకరి కుటుంబ విషయాల్లో మీకెందుకు జోక్యం?, "మీ DNA అంత గొప్పదా? ఆయన మీ DNA గురించి మాట్లాడలేదుగా!" అంటూ నెటిజన్లు ఖుష్బూపై తీవ్రంగా మండిపడుతున్నారు.
Some are just hell bent to prove their DNA. Thank you for proving me right. 🙏😊
— KhushbuSundar (@khushsundar) May 16, 2026
బ్లాక్ మ్యాజిక్.. నరకం చూశా!
ఇక తన భార్య ఆర్తిపై రవి మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. మొదటి రోజు నుంచే నా జీవితం నరకంగా మారింది. నన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేసి పెళ్లి చేసుకున్నారు. చివరికి నాపై చేతబడి కూడా చేశారు. పీఆర్ గ్రూప్స్‌తో నన్ను సైబర్ బుల్లీ చేస్తున్నారు. నేను రోజురోజుకూ చచ్చిపోతున్నా. కానీ నేను చావడానికి ముందే అందరి పని చెప్తా. నా పిల్లలు లేకుండా నేను బతకలేను. కోట్లు సంపాదించినా నా బ్యాంక్ అకౌంట్స్ నా చేతిలో లేవు. నా తల్లిదండ్రుల మాట విననందుకు ఇప్పుడు అనుభవిస్తున్నా అంటూ రవి మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి ఈ 'ఇడ్లీ నటి' వివాదం, బ్లాక్ మ్యాజిక్ ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్‌గా మారాయి.. ఈ వివాదం ఇంకా ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.
