ఏషియన్ చాంపియన్‌షిప్‌కు జితేందర్
న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్ టోక్యో అవకాశాలు మరింత కష్టంగా మారాయి. ఇటలీలో జరిగే ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్, ఆ తర్వాత ఢిల్లీలో జరగబోయే ఏషియన్ చాంపియన్‌షిప్ కోసం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) శుక్రవారం నిర్వహించిన ట్రయల్స్‌కు చేతి గాయంతో బాధపడుతున్న సుశీల్ దూరమయ్యాడు. దీంతో 74 కేజీ కేటగిరీ ట్రయల్స్‌లో గెలిచిన జితేందర్ కుమార్ గోల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు. జితేందర్ ఈ రెండు ఈవెంట్‌ల్లో పతకాలు సాధిస్తే మార్చిలో జరిగే ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్‌కు నేరుగా అర్హత సాధిస్తాడు. అప్పుడు సుశీల్‌ఒలింపిక్ ఆశలు ఆవిరైపోతాయి. శుక్రవారం జరిగిన ట్రయల్స్ ఫైనల్ బౌట్‌లో జితేందర్ 5–2తో అమిత్ ధాంకర్‌పై గెలిచాడు. ఇప్పటికే ఒలింపిక్ టికెట్ దక్కించుకున్న దీపక్ పునియా(86 కేజీ), రవి దహియా(57 కేజీ) శుక్రవారం నేరుగా ఫైనల్లో బరిలోకి దిగి సులువుగా గెలిచారు. ఫ్రీ స్టయిల్‌లో సుమిత్ మాలిక్(125 కేజీ). సత్యవర్త్ (97 కేజీ) ట్రయల్స్‌లో నెగ్గారు.


