వీసీని తొలగించాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ ధర్నా

వీసీని తొలగించాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ ధర్నా

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూ వీసీని తొలగించాలని డిమాండ్​ చేస్తూ గురువారం స్టూడెంట్స్​ ప్రొటెక్షన్​ ఫోరం ఆధ్వర్యంలో వీసీ ఛాంబర్​ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇదేమని అడిగితే అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని నిరసన తెలిపారు.

 దళిత, గిరిజన విద్యార్థులను కించపరుస్తున్నాడని ఫోరం నాయకులు జవ్వాజి దిలీప్, రాహుల్​నాయక్​ తెలిపారు. వీసీ తన వైఖరిని మార్చుకోవాలని, లేదంటే ప్రభుత్వం వెంటనే స్పందించి వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సాగర్​నాయక్, దుర్గాప్రసాద్, సుజయ్, శ్రీనికేతన్, ఆనంద్, ఆదిత్య, చక్రవర్తి, శ్రీకాంత్, వసంత్​ పాల్గొన్నారు.