రేపు ఆన్‌లైన్‌ జూమ్‌ యాప్‌ తో జాబ్‌మేళా

రేపు ఆన్‌లైన్‌ జూమ్‌ యాప్‌ తో జాబ్‌మేళా

రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఫ్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది జిల్లా ఉపాధి కార్యాలయం. ఇందులో భాగంగా రేపు(గురువారం-12) ఉదయం 11:30 గంటలకు ఆన్‌లైన్‌ జూమ్‌ యాప్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు బుధవారం జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి జయశ్రీ ప్రకటించారు. అర్హత ఆసక్తి గల నిరుద్యోగ యువకులు www.ncs.gov.in పోర్టల్‌లో రిజిస్టర్‌ వేసుకుని ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. కంపెనీ HP ప్రతినిధులచే ఆన్‌లైన్‌ వెబినార్‌ ద్వారా ప్రాథమికంగా ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.

ప్రాథమిక ఇంటర్వ్యులో ఎంపికైన వారికి ఫైనల్‌ ఇంటర్వ్యూ వివరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 18/35 ఏళ్లలోపు వయసు గల యువకులు విద్యార్హత 10వ తరగతి ఉండాలన్నారు. వేతనం రూ. 10వేల నుంచి రూ. 18వేల వరకు ఉంటుందని.. వివిధ సంస్థల్లో పని చేసేందుకు 120పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల బయోడేటా లేదా రెస్యూమ్‌ను onlinejobmelaresumes@gmail.comకు పంపాలన్నారు. వివరాలకు 8247656356 నంబరులో సంప్రదించాలని సూచించారు.