జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా కల్పించాలి

జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా కల్పించాలి

హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్లలో జర్నలిస్టులు కూడా ఉన్నారని పలువురు రాజకీయ, జర్నలిస్టు నేతలు అన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టు మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల బీమా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఒక్కరోజు ఉపవాస దీక్ష చేశారు. ఇందులో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి, అమర్‌‌ నాథ్, పాశం యాదగిరి, విరహత్ ఆలీలకు సంఘీభావం తెలుపుతూ ఎంపీ రేవంత్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనోజ్ మరణం సీఎం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి సంతాపం కూడా ప్రకటించలేదన్నారు. అసమర్థ పాలనతో రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. జర్నలిస్ట్లను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. నిజాలు రాస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. కరోనా పోరులో చనిపోయిన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ లకు పీపీఈ కిట్లను ఇవ్వాలని, గాంధీలో జరుగుతున్న వైద్యంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని యాదగిరి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి