సిల్క్స్మిత సిస్టర్లా ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

సిల్క్స్మిత సిస్టర్లా ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాల్లోనే నటించిన విశాల్(Vishal).. ఈసారి  మార్క్ ఆంటోని(Mark Antony) అనే డిఫరెంట్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇంటెన్సివ్ గా ఉంది. 

మార్క్ ఆంటోని ట్రైలర్లో ఫేమస్ యాక్టర్స్ సిల్క్స్మితను చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. నిజంగానే సిల్క్స్మిత ఇందులో యాక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అసలు మార్క్ ఆంటోని  ట్రైలర్లో సిల్క్స్మిత క్యారెక్టర్ రావడానికి ఏఐ టెక్నాలజీ హెల్ప్ తీసుకున్నారా? లేక ఎవరైనా యాక్ట్ చేశారా? అనే డౌట్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇందులో అసలు నిజం ఏంటంటే, ఈ మూవీలో అచ్చం సిల్క్స్మితను పోలి ఉండే ఒక అమ్మాయిని డైరెక్టర్ సెలెక్ట్ చేశాడని టాక్. 

సిల్క్స్మితలా కనిపిస్తోన్న ఈ అమ్మాయి తమిళ యాక్టర్స్ విష్ణు ప్రియా గాంధీ అని తెలిసింది.  జూనియర్ సిల్క్ స్మితగా విష్ణు ప్రియా చలామణి అవుతోంది. దీంతో విష్ణు ప్రియా సినిమా రిలీజ్కు ముందే బాగా పాపులర్ అయ్యింది. ట్రైలర్ చూసిన ఆడియన్స్ సిల్క్స్మిత సిస్టర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  

ఈ మూవీలో యాక్టర్, డైరెక్టర్ ఎస్‌ జే.సూర్య విలన్గా నటిస్తున్నారు. అంతే కాకుండా హీరో విశాల్, ఎస్‌ జే.సూర్య డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. టైమ్ ట్రావెల్, సైన్స్‌‌ ఫిక్షన్‌‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌లో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపిస్తున్నాడు. గ్యాంగ్‌‌స్టర్స్ చేతికి టైమ్ మిషన్ చిక్కితే ఏమవుతుంది అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌. భవిష్యత్తు నుంచి తండ్రి ఆంటోనిని వెతుక్కుంటూ గతంలోకి వస్తాడు మార్క్. ఈ రెండు క్యారెక్టర్స్‌‌ను విశాల్ పోషించాడు. గ్యాంగ్‌‌స్టర్స్‌‌ పాత్రల్లో విశాల్, ఎస్‌‌.జె.సూర్య రెండు డిఫరెంట్ టైమ్‌‌ లైన్స్‌‌లో యంగ్‌‌గా, ఏజ్డ్‌‌గా కనిపించారు. 

ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్‌‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 15న  మార్క్ ఆంటోని రిలీజ్ కానుంది.