- ఆయన సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి వివేక్ వెంకటస్వామి
జూబ్లీహిల్స్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీఎస్‌హెచ్‌ఆర్‌సీ) మాజీ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య మృతిపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని జస్టిస్ చంద్రయ్య నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, న్యాయ రంగంలో జస్టిస్ చంద్రయ్య చేసిన సేవలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలను అధిరోహించడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జస్టిస్ చంద్రయ్య మరణం న్యాయ రంగానికి తీరని లోటని, ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
