
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD). దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే(Deepika padukone), అమితాబ్(Amitab), కమల్ హాసన్(Kamal haasan) వంటి స్టార్ నటిస్తున్నారు. పాన్ వరల్డ్ లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.
అయితే ఈ సినిమాకు తాజాగా లీకుల బెడద మొదలైంది. మేకర్స్ ఎంత జాగ్రత్త పడుతున్నా.. ఈ లీకుల పర్వం మాత్రం ఆగడంలేదు. తాజాగా ఈ సినిమా నుండి ప్రభాస్ కు సంబంధించిన మరో ఫోటో లీకైంది. అయితే ఈ ఫోటో లీక్ పై కల్కి మూవీ మేకర్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ఫోటో లీకవడంలో ఏ సినిమాకు పనిచేస్తున్న VFX హస్తం ఉందని సమాచారం. అందుకే ఆ VFX సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారట మేకర్స్. వారిపై కేసు కూడా నమోదు చేసి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేశారట. మరి ఈ లీగల్ నోటీసులపై ఆ VFX సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.