రేవంత్ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు : కల్వకుంట్ల కవిత

రేవంత్ పాలనలో  మహిళలపై అఘాయిత్యాలు : కల్వకుంట్ల కవిత
  •   12 ఏండ్ల బాలికపై అత్యాచార ఘటన దారుణం: కవిత

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన దారుణమన్నారు. 

జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రత సంగతేంటని ప్రశ్నించారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలనికోరారు. మల్కాజిగిరిలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన దారుణమన్నారు.