- 4 గంటలు అక్కడే ఏడుస్తూ కూర్చున్న పేషెంట్
- రాత్రి 8 గంటలకు మెట్‌పల్లి ఐసోలేషన్ వార్డుకు..
మెట్‌పల్లి, వెలుగు: కరోనామనుషుల్లో మానవత్వాన్నిచంపేస్తోంది. బుధవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు ఇంటికి పంపిస్తే, రెంటుకు ఉంటున్న ఓనర్ వద్దన్నాడు. తిరిగి వచ్చాక హాస్పిటల్లోచేర్చుకునేందుకు స్టాఫ్ ఒప్పుకోలేదు. దీంతో పేషెంట్ను హాస్పిటల్ మార్చురీ పక్కనే అంబులెన్స్స్టాఫ్ దింపేసి పోవడంతో అక్కడే 4 గంటలపాటు ఏడుస్తూకూర్చున్నాడు. మహారాష్ట్రలోని భీవండికి చెందిన బాధితుడు మెట్పల్లికి వలస వచ్చి, దుబ్బావాడలో కిరాయికి ఉంటున్నాడు. ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నాలుగు రోజుల నుంచి జ్వరం, బాడీ పెయిన్స్ఎక్కువగా ఉన్నాయని మెట్ పల్లిసర్కార్ దవాఖానకు వెళ్లాడు. కరోనా లక్షణాలున్నాయని, జగిత్యాల దవాఖానాకు వెళ్లాలని సూచించారు. సోమవారం జగిత్యాల దవాఖానాకు వెళ్లగా టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది. ఒకరోజు ఐసోలేషన్ లో ఉంచిన డాక్టర్లు , అనంతరం హోం ఐసోలేషన్ లో ఉండాలని పంపించేశారు. అంబులెన్స్ లో మెట్ పల్లిలోని అతని ఇంటికి తీసుకెళ్ళ ల ఇంటి ఓనర్ రానివ్వలేదు. రెండున్నర గంటలు పేషెంట్ ను అంబులెన్స్లోనే పడుకోబెట్టారు . చివరకు మెట్ పల్లి దవాఖానకు తీసుకెళ్లారు . డీఎంహెచ్వో పంపారని చెప్పి హాస్పిటల్పక్కనే ఉన్న మార్చురీ వద్దఅంబులెన్స్ సిబ్బంది దింపి వెళ్లిపోయాళ్లి రు. సూపరింటెండెంట్చెప్పేదాకా లోపలికి పంపించమంటూ సిబ్బంది అడ్డుకున్నారు.దీంతో మార్చురీ దగ్గరే నాలుగు గంటలపాటు ఏడుస్తూ ఉండిపోయాడు.విషయం తెలిసి డీఎంహెచ్వో శ్రీధర్ హాస్పిటల్సూపరింటెండ్తో మాట్లాడడంతో రాత్రి 8 గంటలకు హాస్పిటల్లో చేర్చుకున్నారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో తెలిపారు.కరోనా రావడమే పాపమా?
నాకుకరోనారావడం నేనుచేసినపాపమా. నేనుమనిషినే.నాకు ఓ కుటుంబంఉంది. కరోనాసోకితేఇంట్లో కిరానియ్యరా? ఇదేనా
మానవత్వం? కరోనాసో కిందనే బాధకంటే ఈ మనుషులు నాతో వ్యవహరించిన తీరు చూసి చచ్చిపోవాలనిపిస్తోంది. – బాధితుడు
మానవత్వం? కరోనాసో కిందనే బాధకంటే ఈ మనుషులు నాతో వ్యవహరించిన తీరు చూసి చచ్చిపోవాలనిపిస్తోంది. – బాధితుడు
