దళితుడ్ని.. అందుకే సీఎం కాలేకపోయా!

దళితుడ్ని.. అందుకే సీఎం కాలేకపోయా!

కర్నాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర సంచలన కామెంట్స్‌ చేశారు. తాను దళితుడ్ని కాబట్టే మూడుసార్లు సీఎం అయ్యే అవకాశం తనకు రాలేదని అన్నారు. ఈ కారణంతోనే పీకే. బసవలింగప్ప, కె.హెచ్. రంగనాథ్‌, మల్లికార్జున ఖర్గే కూడా సీఎం కాలేకపోయారని చెప్పారు. అనుకోని పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పదవికి ఒప్పుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. “ ప్రభుత్వ స్థాయిలో కూడా దళితులు వివక్షకు గురవుతున్నారు. రిజర్వేషన్లు అమల్లో ఉన్నా అన్యాయం జరుగుతూనే ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

పరమేశ్వర ఏ ఉద్దేశంతో ఇటువంటి కామెంట్స్‌ చేశారో తనకు తెలియదని కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్దారామయ్య అన్నారు. “కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే దళితుల సంక్షేమం కోసం పనిచేస్తోంది. ఆయన ఏ ఉద్దేశంతో అలాంటి కామెంట్స్‌ చేశారో తెలియదు. దీని గురించి పరమేశ్వరను అడగండి” అని అన్నారు. పరమేశ్వర చేసిన కామెంట్స్‌ ను మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప సమర్థించారు. “కాంగ్రెస్‌ పార్టీతో దళితులు సంతోషంగా లేరు. కర్నాటకలో దళితులను కాంగ్రెస్‌ మోసం చేసింది” అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో నెహ్రూ కుటుంబానికి సంబంధించిన వారు మాత్రమే ఉంటారని దేశం మొత్తానికి తెలుసని, కాంగ్రెస్‌ యాంటీ దళిత్‌ , యాంటీ ఓబీసీ అని బీజేపీ నేత నాగరాజు ఆరోపించారు.