శ్రీశైలం, యాదాద్రి ఆలయాల్లో కార్తీక శోభ

శ్రీశైలం, యాదాద్రి ఆలయాల్లో కార్తీక శోభ

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తిక మాసం అందులోనూ సెలవు రోజు కావడంతో శ్రీశైలం ఆలయానికి  భక్తులు క్యూకట్టారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు.  భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలు పరిమితంగా అనుమతిస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

యాదాద్రి కొండ భక్తులతో నిండింది. కార్తిక మాసం అందులోనూ వీకెండ్ కావడంతో లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి భక్తులు క్యూకట్టారు. స్వామివారి దర్శనానికి 3 గంటలు  సమయం పడుతోంది.  కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రత మండపం కిటకిటలాడుతోంది. వ్రత టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు భక్తులు. సర్కార్ స్కూళ్లను మరింత బలోపేతం చేయాలంటున్నారు.