ప్రశ్నిస్తే సమస్యలకు పరిష్కారం: కవిత

ప్రశ్నిస్తే సమస్యలకు పరిష్కారం: కవిత

హైదరాబాద్, వెలుగు: ప్రశ్నిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ పెండింగ్​పనులపై కాంగ్రెస్​ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందని పేర్కొన్నారు. మంగళవారం ఈ ప్రాజెక్టు పనుల విషయమై సీఎం రేవంత్​ రివ్యూపై ఆమె ‘ఎక్స్’​లో స్పందించారు.  తమ ఒత్తిడితోనే త్వరితగతిన భూసేకరణ చేపట్టి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను మొదలు పెట్టాలని, పెండింగ్‌‌లో ఉన్న 19, 20, 21 ప్యాకేజీల పనులు ప్రారంభించే వరకు రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పారు.