16వ స్థానంతో కేసీఆర్ పాలనేందో తేలిపోయింది-ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
యాదాద్రి, వెలుగు: సీ ఓటర్సర్వేలో తెలంగాణకు 16వ స్థానం దక్కడంతోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎలా ఉందో తేలిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ ఫస్ట్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి ‘2001లో పూటగడవని వ్యక్తి అక్రమాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. జాజిరెడ్డిగూడెం, జానకీపురంలో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారు. శంషాబాద్‌లో అతిపెద్ద ఫాంహౌస్ నిర్మించుకున్నారు. సొంతూరు నాగారంలో రూ. 100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. మూడు హత్య కేసుల్లో ఏ-1, ఏ-2, ఏ-6గా ఉన్నారని, ఇలాంటి వ్యక్తి మంత్రి కావడం సిగ్గుపడాల్సిన విషయం’ అని అన్నారు. కాంగ్రెస్ కారణంగానే 203 జీవో వచ్చిందంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ దయవల్లే నల్గొండ నుంచి ఎంపీగా గుత్తా గెలిచారన్నారు. పూటకో పార్టీ మార్చే గుత్తా కాంగ్రెస్‌ను విమర్శిస్తారా.. అని మండిపడ్డారు. ఆరేళ్లుగా టీఆర్ఎస్అధికారంలో ఉంటే జీవో రావడానికి కాంగ్రెస్ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు. 203 జీవో రావడానికి సీఎం కేసీఆర్కారణమన్నారు.
గంధమల్లపై పోరుబాట
గంధమల్లను చూపించి రెండుసార్లు గెలిచిన ఆలేరు ఎమ్మెల్యే సునీత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. గంధమల్ల రిజర్వాయర్ ను రద్దు చేయడం వల్ల ఆలేరు నియోజవకర్గానికి సాగునీరు లభించదన్నారు. ఈ మధ్యే ప్రారంభించిన కొండపోచమ్మ తొందరగా పూర్తయిందని, బస్వాపురం ఎందుకు కాలేదని నిలదీశారు. గంధమల్ల రిజర్వాయర్‌ను పునరుద్ధరించాలని, బస్వాపురం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో పోరాటయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈసారి బోనాల పండుగ లేనట్లే
నిజంగానే రాజ్‌భవనం
అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

