బీజేపీని ముట్టుకుంటే మసైతవ్​

బీజేపీని ముట్టుకుంటే మసైతవ్​

ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష వేదికపై బీజేపీ ఎమ్మెల్యేల గర్జన
నియంతలకు పట్టిన గతే కేసీఆర్‌‌‌‌కు పడుతది: ఈటల
కేసీఆర్‌‌‌‌పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు రానుంది: రఘునందన్
టీఆర్ఎస్ అవినీతి దొంగలపై బుల్డోజర్లు ఎక్కిస్తం: రాజాసింగ్
ఇందిరా పార్కు ధర్నాచౌక్‌‌లో దీక్ష.. హాజరైన వివేక్, లక్ష్మణ్, బాపురావు

హైదరాబాద్, వెలుగు: ‘‘కేసీఆర్.. ఖబర్దార్! తెలంగాణలో ఇక నీ కథ ముగిసింది.. బీజేపీని ముట్టుకుంటే మాడి మసై పోతవు” అంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పీకేలు, ఏకే 47లు కేసీఆర్ అధికారాన్ని కాపాడలేవని, ఆయన గద్దె దిగడం ఖాయమని, తెలంగాణలో  బీజేపీ జెండా రెపరెపలాడడం పక్కా అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అవినీతి దొంగల పైకి బుల్డోజర్లను ఎక్కిస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌‌‌‌తో యుద్ధానికి బీజేపీ సైనికులు సిద్ధం కావాలని క్యాడర్‌‌‌‌కు పిలుపునిచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు చూపిన ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు చూపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ పూర్తిగా కోల్పోయారని, ఇక ఆయన్ను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని స్పీకర్ తిరస్కరించిన తీరును నిరసిస్తూ ఆ పార్టీ గురువారం ఇందిరా పార్కు వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ చేపట్టింది.

దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. చరిత్రలో నియంతలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో లేకుండా సస్పెండ్ చేసినందుకు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మూర్ఖపు ఆలోచనను కేసీఆర్ లేవనెత్తినందుకు నిరసనగా దీక్ష చేపట్టామని చెప్పారు. సభలో నిరసన చెప్పే హక్కు లేకుండా.. పోలీసులను పెట్టి, అరెస్ట్ చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడేశారని ఆరోపించారు. ఇంతటి నీచపు ప్రభుత్వం, నికృష్ట సీఎం ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన దీక్షలే పల్లె పల్లెనా చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే దాకా పోరాటం ఆగదన్నారు. బీజేపీకి సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గేట్ వే ఆఫ్ ఇండియా మన తెలంగాణ  అని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం సింపుల్ మెజారిటీతో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని, అలాంటి రాజ్యాంగమే లేకపోతే కేసీఆర్ జేజమ్మ దిగి వచ్చినా తెలంగాణ వచ్చేదా అని ఈటల నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు బయట ఉంటే.. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు, హేళన చేసిన వారు కేసీఆర్ వెంట ఉన్నారన్నారు.

ధర్నాచౌక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎత్తేసి.. మళ్లీ తానే ధర్నా చేసి..

‘‘ఇందిరా పార్క్ చైతన్యానికి అడ్డా.. అణగారిన వర్గాల బావుటా. ఆ ధర్నా చౌక్ నే కేసీఆర్ ఎత్తేసిండు. తిరిగి తానే స్వయంగా 16 మంది మంత్రులతో ధర్నా చేసే దిగజారిన స్థితికి చేరిండు” అని ఈటల అన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుకు చాలెంజ్ చేస్తున్నా.. బడ్జెట్ మీద చర్చకు రెడీనా అని సవాల్ విసిరారు. బడ్జెట్ మొత్తం అబద్ధమేనని, దొంగ లెక్కలు, దొంగ అంకెలని ధ్వజమెత్తారు. కానీ కేంద్ర బడ్జెట్ ఒక్క రూపాయి కూడా అటు ఇటు కాదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనని విమర్శించారు. పుట్టే బిడ్డపై కూడా రూ.1.25 లక్షల అప్పు ఉన్నది  నిజం కాదా అని నిలదీశారు. ‘‘2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ ను మింగింది కేసీఆర్ కాదా? ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదా? రూ.600 కోట్లు ఖర్చు పెడితేనే హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిన్ను ఖతం పట్టించారు” అని అన్నారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తయ్: రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే స్పీకర్ తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తాము ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ కాపీని మూడు సార్లు తిప్పి తిప్పి చూశారని, ఏమైందో ఏమో తర్వాత తిరస్కరిస్తున్నట్లు చెప్పారన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఏ పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్యాంగం నడవాలంటే ప్రజలు సంఘటితం కావాలని కోరారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు రానుందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు చూపిన చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు 
అందిపుచ్చుకోవాలని కోరారు.  

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: రాజాసింగ్

తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి దొంగలపైకి బుల్డోజర్లను ఎక్కిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని నియోజకవర్గానికో బుల్డోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గిఫ్ట్​గా పంపించనున్నారని చెప్పారు. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యుద్ధానికి పార్టీ క్యాడర్ రెడీగా ఉండాలని కోరారు. రావణ వధ మాదిరి.. ‘ఆర్​ఆర్​ఆర్’ చేతిలో వధకు కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ దొర అహంకారంతో పాలన చేస్తున్నాడని ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు.  

కేసీఆర్ టూర్లు ఎందుకు ఆగినయ్?: డీకే అరుణ

ఇటీవల వెల్లడైన నాలుగు రాష్ట్రాల ఫలితాలతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాస్తవాలు తెలిశాయని, రాష్ట్రాల పర్యటనలను కేసీఆర్ ఎందుకు ఆపేసుకున్నాడో చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. మహిళా గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అవమానించిన కేసీఆర్ ను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న భారత సైనికులను అవమానించిన చరిత్ర కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్ తర్వాత ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దీక్షకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా.. పార్టీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

దీక్షలో పాల్గొనని సంజయ్

బీజేపీ పెద్ద ఎత్తున చేపట్టిన ఈ దీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొనలేదు. దీక్షలో ఆయన లేకపోవడంతో పార్టీలో అందరూ ఆరా తీశారు. ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీలు ఉండడంతోనే దీక్షకు రాలేకపోయానని పార్టీ నేతలకు సంజయ్ సమాచారం ఇచ్చారు.