కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మొదటి రోజు గణపతి పూజతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో పూజ ముగిశాయి. ఆలయ చైర్మన్ తాటకం రమేష్ శర్మ దంపతులు యాగశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు యాగశాలలో ఏర్పాటు చేసిన హోమ గుండానికి నిర్వహించిన పూర్ణాహుతి పూజలుతో బ్రహ్మోత్సవాలు ముగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ సుధాకర్ రెడ్డి, ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
