మానవుడు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా…తమకున్న తెలివితేటలతో టెక్ ప్రపంచాన్ని దున్నేస్తున్నా ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలు ఆగడం లేదు. జానెడు పొట్టకోసం పడరాని పాట్లు పడుతున్నారు. మరికొందరు తినడానికి తిండి ఉన్నాదాని విలువ తెలియక వృధా చేస్తున్నారు.
ఇటీవల ప్రపంచ ఆకలి కేకలు ఎలా ఉన్నాయని అంశంపై గ్లోబల్ ఇండెక్స్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రపంచంలో తీవ్రమైన ఆకలి బాధను ఎదుర్కొంటున్న 45 దేశాల్లో భారత్ కూడా ఉందని తేల్చిచెప్పింది. మనదేశంలో ఇలా ఉంటే ఆఫ్రికా దేశాల్లో ఆకలి చావులు కలిచివేస్తున్నాయి.
ముఖ్యంగా కెన్యాలో ఈ సమస్య కంటతడిపెట్టిస్తుంది. కెన్యాలోని మాల్వాయి ప్రజలు ఆకలి బాధనుంచి తప్పించుకునేందుకు చేపలకోసం పడరానిపాట్లు పడుతున్నారు. పనిలేక, తిండిలేక సముద్రంలో దొరికే చేపలతో కడుపు నింపుకుంటున్నారు.
ఇక భర్తలేని ఆడవాళ్లపరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కపూట బిడ్డలకు అన్నంపెడితే చాలనుకుంటున్నారు అక్కడి తల్లులు. కన్నబిడ్డల ఆకలి కేకలు ఆతల్లికి తప్ప మరేదీ కనిపించదనేలా వ్యవహరిస్తున్నారు. చేపల వేట కోసం సముద్రానికి వెళుతున్నారు. చేపలు దొరక్కపోతే బిడ్డల ఆకలి తీర్చడం కష్టంగా మారుతందని..అక్కడి జాలర్లను బ్రతిమలాడి చేపల్ని తీసుకొని అమ్ముకుంటున్నారు.
జాలర్లు వారి బలహీనతల్ని ఆసరగా చేసుకుంటున్నారు. తమకోరిక్కల్ని తీరిస్తే తప్ప చేపలు ఇవ్వమని కండీషన్లు పెడుతున్నారు. ఆ కండీషన్లకు అంగీకరిస్తే చేపలు ఇస్తున్నారు. జజ్వా అనే పిలిచే ఈ విష సంస్కృతిలో ఎంతో మంది తల్లులు పడుపు వృత్తిలో మగ్గిపోతున్నారు. పడుపువృత్తి చేయగా జాలర్లు ఇచ్చిన చేపలతో పిల్లల కడపు నింపుతు జీవనం సాగిస్తున్నారు.

