మామూలుగా పెళ్లికి సంబంధించిన ఫొటోషూట్ అంటే బ్యూటీఫుల్ ప్లేసెస్, మౌంటెన్స్, చెట్లు, గార్డెనింగ్.. ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ ఓ వధువు మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించింది. తన వివాహం సందర్భంగా ఫొటోషూట్ కు సిద్ధమైన కేరళకు చెందిన ఓ పెళ్లికూతురు.. గుంతలు పడ్డ రోడ్డుపై నడుస్తూ ఫొటోలకు ఫోజిచ్చింది. పెళ్లి కుమార్తె గెటప్ లో ముస్తాబై నగలు ధరించి గుంతల్లో నీరు నిలిచిన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఫొటోలు దిగింది.
అయితే ఈమె ఇలా చేయడం వెనకు అసలు కారణం ఏమిటంటే ఇటీవలి వర్షాలకు అక్కడి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. వాటిని సరిచేయాలనే సామాజిక బాధ్యతతోనే తానిలా చేశానని ఆ వధువు చెప్పడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోషూట్ కు సంబంధించిన పలు ఫొటోలను ఆమె కోరిక మేరకు ఏరో వెడ్డింగ్ కంపెనీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
