లోన్ డాక్యుమెంట్స్ కోసం చీరకట్టులో బ్యాంకుకు వెళ్లిన రోబో

లోన్ డాక్యుమెంట్స్ కోసం చీరకట్టులో బ్యాంకుకు వెళ్లిన రోబో

ఓ కంపెనీకి లోన్ మంజూరైంది. ఆ లోన్ తీసుకునే ముందు తమ టాలెంట్ ను బ్యాంక్ అధికారులకు చూపించాలనుకుంది. అనుకోవడమే కాదు..చూయించింది కూడా. ఓ రోబో కంపెనీకి ఫెడరల్ బ్యాంక్ లోన్ మంజూరు చేయగా..దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను తీసుకోవడానికి రోబో వెళ్లడం అందరినీ ఆకర్షించింది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది.

అసిమోవ్ రోబోటిక్స్ కంపెనీకి ఫెడరల్ బ్యాంక్ లోన్ మంజూరు చేసింది. తమ టాలెంట్ను బ్యాంక్ వాళ్లకి చూపించాలనుకున్న కంపెనీ ఈ లోన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవడానికి  రోబోనే పంపించింది. సాయాబాట్ అనే రోబో చీరలో బ్యాంక్ కు వెళ్లగా.. బ్యాంకు అధికారులు లోన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ను దానికి అందజేశారు.

‘‘అసిమోవ్ రోబోటిక్స్ తరుపున లోన్ డాక్యుమెంట్స్ అందుకోవడం గొప్పగా ఉంది. స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి ఫెడరల్ బ్యాంక్ అండగా నిలుస్తుందని మరోసారి రుజువైంది’’ అని సాయాబాట్ రోబో తెలిపింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ బ్యాంక్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఫెడరల్ బ్యాంక్ సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ వెల్లడించారు.