మా ఇండ్లపై పొలిటికల్ దందా ఏంటి..?

మా ఇండ్లపై పొలిటికల్ దందా ఏంటి..?

పంజాగుట్ట, వెలుగు: ఖైరతాబాద్​లోని ఇందిరానగర్ డబుల్ బెడ్​రూమ్ ఇండ్ల వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వం తమకు అన్ని రకాల మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ, స్థానిక నాయకులు ఇండ్లు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లబ్ధిదారులు ఇండ్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. 

డబుల్ బెడ్​రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం తాము సొంత స్థలాలను ప్రభుత్వానికి ఇచ్చామని, పట్టాలు కూడా పొందామని, అయినప్పటికీ ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన ఇండ్లను ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, సంపన్న వర్గాలకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు సోమయ్య, శ్రీలత, గాయత్రి తదితరులు డిమాండ్ చేశారు.