నేను డిప్యూటీ కమిషనర్‌‌ని.. లక్ష ఫైన్ వేస్తానంటూ చిందులు

నేను డిప్యూటీ కమిషనర్‌‌ని.. లక్ష ఫైన్ వేస్తానంటూ చిందులు

సికింద్రాబాద్: షాపింగ్ మాల్ వద్ద ఓ చిరుద్యోగి పెద్ద బిల్డప్ ఇచ్చి నానా హంగామా సృష్టించాడు. నేను తలచుకుంటే మీకు ఇప్పుడే రూ.లక్ష ఫైన్ వేస్తానంటూ చిందులు తొక్కాడు. వాలకం చూసి అనుమానించిన షాపింగ్ మాల్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పేరుతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గ్రేటర్ లో శానిటరి ఫీల్డ్ అసిస్టెంట్ గా గుర్తించారు. 
ట్రేడ్, లేబర్ లైసన్స్ చూపించమంటూ హంగామా
కుషాయిగూడ పరిధిలోని అనుటెక్స్ షాపింగ్ మాల్ వద్ద  తాను జీహెచ్ఎంసి డిప్యూటి కమీషనర్ అంటూ హంగామా సృష్టించడం ప్రారంభించాడు. ట్రేడ్, లేబర్ లైసెన్స్ చూపించకపోతే లక్ష ఫైన్ వేస్తా నంటూ డాంబికాలు పలుకుతూ చిందులు తొక్కుతుంటే సిబ్బందికి అనుమానం వచ్చింది. జీహెచ్ఎంసి డిప్యూటి కమీషనర్నంటూ బెదిరిస్తున్న వ్యక్తిని  పట్టుకుని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అతడు ఖైరతాబాద్ జీహెచ్ఎంసి శానిటరి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు తేలింది. కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు.