కోల్కతా ఫెయిల్.. ఢిల్లీకి స్వల్ప టార్గెట్

కోల్కతా ఫెయిల్.. ఢిల్లీకి స్వల్ప టార్గెట్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న ఢిల్లీ.. కోల్ కతాను కట్టడిచేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా 9 వికెట్లు కోల్పోయి.. 127 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ జేసన్ రాయ్ (43, 39 బంతుల్లో) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ అంతా ఫెయిల్ అయ్యారు. మన్ దీప్ సింగ్ (12, 11 బంతుల్లో), రస్సెల్ ( 38, 31 బంతుల్లో) చివరి ఓవర్లలో ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. 

ఢిల్లీ బౌలర్ల దాటికి కోల్ కతా తక్కువ పరుగులకే చాప చుట్టేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోకియా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ముకేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. చాలా కాలం తర్వాత టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 19 పరుగులే ఇచ్చాడు.