పీజేటీఏయూలో బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సు వద్దు

పీజేటీఏయూలో బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సు వద్దు

గండిపేట, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ (పీజేటీఏయూ) పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కాలేజీలో బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సును ప్రవేశపెట్టే ప్రతిపాదనను రద్దు చేయాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ విద్యార్థులు కోరారు. 

గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్యదర్శి సురేంద్ర మోహన్‌‌లకు వినతిపత్రాలు అందించారు. స్పందించిన మంత్రి.. సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.