అడవుల సంరక్షణ, పచ్చదనంపై దృష్టిపెట్టాం : మంత్రి కొండా సురేఖ

అడవుల సంరక్షణ, పచ్చదనంపై దృష్టిపెట్టాం :  మంత్రి కొండా సురేఖ
  •     మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: అడవుల సంరక్షణ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో మంజూరైన ప్రాజెక్టుల అమలు, పురోగతిని సమీక్షించి కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 

నర్సరీల ఏర్పాటు, అర్బన్ పార్కుల అభివృద్ధి, అటవీ సంరక్షణ, పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు, ఎకోటూరిజం అభివృద్ధి వంటి  ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరిత నిధి కీలక వేదికగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ప్రాజెక్టును సమర్థవంతంగా అమలుచేయాలన్నారు.