ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ కృతికి దక్కిందంటే అదృష్టమేగా మరి!

ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ కృతికి దక్కిందంటే అదృష్టమేగా మరి!

ఒక్క సినిమాతోనే స్టార్స్ అయిపోయేవాళ్లు కొందరు. మొదట్లో కాస్త దెబ్బలు తిన్నా మెల్లగా నిలదొక్కుకుని స్టార్స్ అయ్యేవారు ఇంకొందరు. కృతీ సనన్ ఈ రెండో కేటగిరీకి చెందుతుంది. ఎనిమిదేళ్ల క్రితం మహేష్‌‌‌‌‌‌‌‌ బాబు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కృతికి.. టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో కలిసి రాలేదు. దాంతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌కి వెళ్లిపోయి అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్ హీరోయిన్ అనిపించుకోడానికి ఎక్కువ టైమే పట్టింది. ఎలాగైతేనేం.. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోల సినిమాలను బ్యాగ్‌‌‌‌‌‌‌‌లో వేసుకునే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం షెహ్‌‌‌‌‌‌‌‌జాదా, భేడియా, గణపత్ లాంటి భారీ బాలీవుడ్ చిత్రాలతో పాటు ప్రభాస్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌‌‌‌‌‌‌‌’లోనూ నటిస్తోంది.

ఇప్పుడు డిజిటల్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీ అవుతోంది. అది కూడా ‘శివ’ అనే ఓ ప్రెస్టీజియస్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌తో. మిస్టర్ ఇండియా, ఎలిజబెత్ లాంటి సెన్సేషనల్‌‌‌‌‌‌‌‌ చిత్రాలు తీసిన శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. అమీష్ త్రిపాఠి రాసిన ‘శివ’ అనే ట్రయాలజీ బుక్ సిరీస్‌‌‌‌‌‌‌‌లోని మొదటి పుస్తకమైన ‘ద ఇమ్మోర్టల్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ మెలూహ’ ఆధారంగా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ రూపొందనుంది. అందులోని సతి అనే పాత్రను కృతి పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఆమె లక్కీ చాన్స్ కొట్టేసినట్టే. ఎందుకంటే శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పని చేయాలని ఎంతోమంది ఆశపడతారు. ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ కృతికి దక్కిందంటే అదృష్టమేగా మరి!