ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి : కూనంనేని సాంబశివరావు

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి : కూనంనేని సాంబశివరావు
  • సీఎం రేవంత్​ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ 

హైదరాబాద్, వెలుగు: వరి, మొక్కజొన్నకొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. శుక్రవారం సీఎం రేవంత్​ రెడ్డికి ఆయన లేఖ రాశారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం లారీలు సకాలంలో ఖాళీ కాక ధాన్యం కొనుగోలుకు అడ్డంకిగా మారిందన్నారు. లారీల కొరతతో కొనుగోలు సెంటర్లలో ధాన్యం సేకరణ మందగించింద న్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు.