హలో యాప్ కోసం మహేష్ బాబు

హలో యాప్ కోసం మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ హ్యండ్సమ్ హీరోకి ఆల్ ఓవర్ ఇండియా అంతా ఫ్యాన్సే. అందుకోసమే ఎన్నో సంస్థలు, కంపెనీలు తమ ఉత్పత్తులని ప్రమోట్ చేసుకునేందుకు మహేష్ వెంట పడతాయి.  అయితే ఇప్పటికే ఎన్నో కంపెనీల యాడ్ లు చేసిన మహేష్ తాజాగా ఓ సోషల్ మీడియా యాప్ Helo(హలో) కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు.

స్మార్ట్ ఫోన్ వాడుతున్న చాలామంది యువతకి ఈ యాప్ తెలిసే ఉంటుంది. రోజూ వారీ వార్తలు, వైరల్ అవుతున్న విశేషాలు, జోకులు, మేమేలు, వాట్సప్ స్టేటస్, శుభాకాంక్షలు.. మొదలైనవన్నీ ఈ యాప్ ద్వారా తమ  స్నేహితులు, బంధువులతో పంచుకోవచ్చు.  తెలుగు, హిందీ,  తమిళంతో పాటు మొత్తం 14 భారతీయ భాషల్లో పాపులర్ అయిన ఈ యాప్ కి మహేశ్  బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు.

ఇందుకోసం ముంబైకి చెందిన ఓ లేడీ డైరెక్టర్ ఖ్యాతీ దర్శకత్వంలో మహేష్ సోమవారం ఓ కమర్షియల్ యాడ్ చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ యాడ్ ను చిత్రీకరించారు. త్వరలో ఈ యాప్ కి సంబంధించిన ఆ యాడ్ మన ముందుకు రానుంది.

lady director Kyathi directed Helo app ad with mahesh babu