బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మద్దతు తెలిపారు. బీజేపీ ఎదుట తలవంచని నాయకులకు వేధింపులు తప్పవన్నారు ప్రియాంక. బీజేపీ బ్రాండ్ రాజకీయాల ముందు తలవంచని వారికి బీజేపీ వేధింపులు తప్పవని ప్రియాంక ట్వీట్ చేశారు. ఆర్జేడీ నాయకుడికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో రాజీపడని కారణంగా లాలూ దాడికి గురవుతున్నారన్నారు. ఆయనకు న్యాయం జరుగుతుందని ప్రియాంక వాద్రా ట్వీట్ చేశారు.
దాణా కుంభకోణంలో ఇటీవల లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం లాలూను ఐదో కేసులోను దోషిగా నిర్ధారించింది. ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ ప్రసాద్ దోషిగా తేలారు. ఇప్పుడు ఐదో కేసులోనూ దోషి అంటూ తీర్పు వచ్చింది. లాలూ.. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం జరిగింది. డోరాండా ట్రెజరీ నుంచి 139 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూపై అభియోగాలు ఉన్నాయి. 1990-1995 మధ్యకాలంలో కుంభకోణం జరగ్గా.. లాలూను 1997లో నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఈ కేసులో లాలూ ప్రసాద్‌తో పాటు 110 మంది నిందితులు ఉన్నారని సీబీఐ తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగా 575 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నారు. 25 ఏళ్ల తరువాత సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
