- కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభ అవకాశం దక్కలేదని పార్టీ వీడిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వలలో చిక్కుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి విమర్శించారు. ఆ పార్టీలో చేరిన రోజే పండుగని, తర్వాత అంతా దండగేనని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఎదుర్కొన్న చేదు అనుభవాలే జీవన్ రెడ్డికి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్, రాజయ్య లాంటి వారిని బయటికి పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించి,14 సార్లు పార్టీ తరపున జీవన్ రెడ్డి పోటీ చేశారని గుర్తు చేశారు.
