ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!

ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!

LPG సిలిండర్ కస్టమర్లు ఆధార్-బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయడానికి గడువు సమీపిస్తోంది. ఇప్పటివరకు తప్పనిసరి అయిన e-KYC ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే స్పందించాల్సిన సమయం దగ్గరపడింది. ఎలాంటి అంతరాయాలు లేకుండా సబ్సిడీలు, సేవలను పొందాలంటే ఆగస్ట్ 31, 2026 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడం అనివార్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా గత వారం ప్రభుత్వం ఈ డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉండటంతో.. గత వారమే ఈ గడువును అధికారులు పొడిగించారు. ఈ వెసులుబాటును వినియోగదారులు సద్వినియోగం చేసుకుని, ఎలాంటి తొందరపాటు లేకుండా చివరి తేదీ లోపు తమ ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రముఖ చమురు మార్కెటింగ్ కంపెనీలు కస్టమర్లను నిరంతరం అప్రమత్తం చేస్తున్నాయి. గడువులోగా ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే భవిష్యత్‌లో ఎల్‌పీజీ సబ్సిడీలు నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. సకాలంలో స్పందించకపోతే గ్యాస్ సిలిండర్ బుకింగ్స్, డెలివరీలో ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది.

ALSO READ : ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్..

ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే వినియోగదారులు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లాలి. అలాగే గ్యాస్ కంపెనీలు అందించిన మొబైల్ యాప్‌ల ద్వారా కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు. డెడ్‌లైన్ ముగిసే వరకు వేచి చూడకుండా.. ఇప్పుడే మీ సమీప కేంద్రంలో ఈ-కేవైసీ పూర్తి చేసి ఎలాంటి అంతరాయాలు లేకుండా ఎల్పీజీ సేవలను పొందండి.