కోల్‌కతా: బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్‌గా మారారు. గురువారం నల్లకోటు ధరించి కలకత్తా హైకోర్టుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల గురించి టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని కోరారు. మమతా బెనర్జీ తొలిసారిగా హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఫలితాలు రాగానే టీఎంసీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 మంది మరణించారని, 150కి పైగా టీఎంసీ కార్యాలయాలు ధ్వంసమయ్యాయని, మొత్తంగా 2 వేల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని మమత కోర్టుకు తెలిపారు.
