వాడుకోని వదిలేయడం సీఎం కేసీఆర్ కు అలవాటే

వాడుకోని వదిలేయడం సీఎం కేసీఆర్ కు అలవాటే

హైదరాబాద్ : వాడుకోని వదిలేయడం సీఎం కేసీఆర్ కు అలవాటే అన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ పేరు మాత్రమే ఉండాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ఉద్యమకారుల్ని వదిలేసి..కమీషన్ ఏజెంట్లను పోషిస్తున్నారని విమర్శించారు వివేక్. కేటీఆర్ ను సీఎం చేయడానికే ఈటలతో పాటు సీనియర్లను పక్కనపెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ పై ప్రభుత్వ జులుంని ఖండించారు వివేక్ వెంకటస్వామి.