ఆఫర్: హోమ్ లోన్​ తీసుకుంటే 75 ఏళ్లొచ్చే దాకా కట్టొచ్చు

ఆఫర్: హోమ్ లోన్​ తీసుకుంటే 75 ఏళ్లొచ్చే దాకా కట్టొచ్చు

LIC, IMGC ఒప్పందం కొత్త లోన్లకు గిరాకీ పెరిగే అవకాశం

వెలుగు: వయోధికులకూ ఇక నుంచి హౌసింగ్‌‌‌‌ లోన్లు మంజూరు చేయాలని ఎల్‌‌‌‌ఐసీ హౌసింగ్‌‌‌‌ ఫైనాన్స్ (ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ ఎఫ్‌ ఎల్‌‌‌‌) నిర్ణయించింది. 75 ఏళ్లు వచ్చేలోపు అప్పులను తీర్చాల్సిఉంటుంది. ఇందుకోసం ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌‌‌‌ ఇండియా మార్ట్‌‌‌‌గేజ్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (ఐఎంజీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. డిఫాల్ట్‌‌‌‌ల నుంచి రక్షణ కోసం ఐఎంజీసీ ఇన్సూరెన్స్‌‌‌‌ ఇస్తుంది. ఉద్యోగేతర వర్గాలకు దీర్ఘకాలిక అప్పులు ఇస్తామని ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ఎఫ్‌ ఎల్‌‌‌‌ఎండీ, సీఈఓ వినయ్‌ షా వెల్లడించారు. ఆస్తులను తనఖా పెట్టుకొని అప్పులు ఇస్తామని వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం.. వయోధికులు లోన్ పొందాలంటే ఐఎంజీసీకి కొంతమొత్తం ప్రీమియం చెల్లించాలి. ఈ కంపెనీ దరఖాస్తుదారుడి లోనులో 20 శాతానికి హామీగా ఉంటుంది. దాదాపు ఆరు వాయిదాల వరకు భరిస్తుంది. ఫలితంగా ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ ఎఫ్‌ఎల్‌‌‌‌కు ఎగవేతల సమస్య ఉండదు. మొత్తం లోను దాదాపు 1.5 శాతం వరకు ఐఎంజీసీకి ప్రీమియంగా రుణగ్రహీతే చెల్లించాలి. దీనిని నెలసరి వాయిదాల్లో సర్దుబాటు చేస్తారు. ‘‘ఈ ఒప్పందం వల్ల మరింత మందికి హౌసింగ్‌‌‌‌ లోన్లు ఇవ్వగలుగుతాం. ఉద్యోగం, పనిప్రదేశం, క్రెడిట్‌‌‌‌ హిస్టరీ వంటి కారణాలతో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారికి ఇప్పుడు అప్పులు పుట్టే అవకాశాలు ఉన్నాయి. సూక్ష్మ, చిన్న మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థల ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవాళ్లూ మా వినియోగదారులు అవుతారు. ‘2022 నాటికి అందరికీ గృహవసతి’ కల్పించాలనే లక్ష్య సాధనకు మా వంతుసాయం చేస్తాం’’అని షా వివరించారు.

మార్కెట్లో లిక్విడిటీ లేక హౌజింగ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీలు ఇబ్బందిపడుతున్న సమయంలో ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌‌‌‌ తన మార్కెట్‌‌‌‌ షేర్‌‌‌ను పెంచుకోవడానికి ఐఎంజీసీతో జట్టుకట్టింది. హౌసింగ్‌‌‌‌ రంగం ప్రస్తుతం కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్న మాట నిజమే అయినా, ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ ఎఫ్‌ఎల్‌‌‌‌ వంటి భారీ కంపెనీలకు డిమాండ్‌ ను అందిపుచ్చుకోగల సత్తా ఉందని ఐఎంజీసీ తెలిపింది. ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ ఎఫ్‌ఎల్‌‌‌‌తో తమ ఒప్పందం వల్ల స్వల్పకాలంలోనే భారీ వృద్ధి నమోదవుతుందని ఈ సంస్థ సీఈఓ మహేశ్‌ మిశ్రా అన్నారు . అప్పులు ఇవ్వడం ద్వారా మార్కెట్‌‌‌‌ను పెంచుకోవడంతోపాటు సరైన ధరకు దొరికితే ఇతర పోర్ట్‌‌‌‌ఫోలియోలను కొనడానికి కూడా ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ ఎఫ్‌ఎల్‌‌‌‌ సిద్ధంగా ఉందని వెల్లడించారు. నేషనల్‌‌‌‌ హౌజింగ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, జెన్‌ వర్త్‌‌‌‌ ఇన్‌ కార్పొ రేషన్‌ , ఇంట్నేషనల్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌ అండ్‌ ఆసియన్‌ డెవెలప్‌ మెంట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఉమ్మడిగా ఐఎంసీజీని ఏర్పాటు చేశాయి. ఎల్‌‌‌‌ఐసీహెచ్‌ ఎఫ్‌ఎల్‌‌‌‌ వంటి హౌజింగ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ సంస్థలకు ఇది ‘మార్ట్‌‌‌‌గేజ్‌ డిఫాల్ట్‌‌‌‌ గ్యారంటీ’ఇస్తుంది. ఎవరైనా అప్పులు ఎగ్గొడితే పరిహారం చెల్లిస్తుంది